: ఎడ్ సెట్ పరీక్ష ప్రారంభం, ప్రాభవం కోల్పోతున్న బీఈడీ


రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ సెట్ పరీక్ష ప్రారంభమైంది. 287 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. మొత్తం 1.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది బిఈడీ పరీక్షకు విద్యార్ధుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. గవర్నమెంటు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డీఎడ్ కు లభించినంత ఆదరణ దీనికి లభించడం లేదు. దీనికి ప్రధాన కారణాలుగా సెకండరీ విద్యార్ధులకు బీఈడీ క్వాలిఫైడ్ వారిని అనుమతించక పోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు డైట్ సెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రాధమిక విద్యాస్ధాయిలో ఎక్కువ మంది టీచర్లు రిటైర్ అవుతుండడానికి తోడు ఇంటర్ క్వాలిఫికేషన్ కావడంతో అటు వైపు ఎక్కువ మంది ఆకర్షితులౌతున్నారు.

  • Loading...

More Telugu News