: సోంపేట కాల్పుల ఘటన విచారణ వాయిదా
శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్ నిర్వహించిన విచారణపై కౌంటర్ దాఖలు చేయాలని పిటీషనర్ కు కోర్టు సూచించింది. శ్రీకాకుళం అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సోంపేట వాసులు 2010 జూలై 14 న గళమెత్తారు. సర్వేల్లో, ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ ప్లాంట్ వద్దని, తమది ప్రత్యేకత గలిగిన బీల ప్రాంతమని, ఈ ప్రాంతంలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే వేలాది జంతు జాతులు, వృక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని కోర్టుకెక్కారు. ఈ సందర్భంగా పోలీసుల బందో బస్త్ తో ప్లాంట్ నిర్మాణానికి ఉపక్రమించగా ఎదురొడ్డారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు సమీప గ్రామాల ప్రజలు మరణించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.