: రాజ్ నాథ్ తో భేటీ కానున్న టీజేఏసీ నేతలు


తెలంగాణ జేఏసీ నేతలు ఈ రోజు హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్టానికి వస్తున్నందున, మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ నాథ్ ను కలుసుకుని తెలంగాణపై చర్చిస్తారు. బీజేపీతోనే తెలంగాణ సాథ్యమని, కాంగ్రెస్ ఎప్పటికీ తెలంగాణ ఇవ్వదని బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రాజ్ నాథ్ జేఏసీ నేతలకు వివరించి, బీజేపీతో కలిసి రావాలని, తెలంగాణ రాష్ట్రం కోసం, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని కోరనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News