: గల్ఫ్ బాధితులకు సర్కారు చేయూత


దేశం కాని దేశంలో చేతిలో రూపాయి లేక అగచాట్లు పడుతున్న తెలుగువారికి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. యూఎఈలో ఆర్థిక ఇబ్బందులతో వీసా గడువు తీరినా ఇండియా రాలేక ఇబ్బందులు పడుతున్న బాధితులను ప్రభుత్వం తిరిగి స్వదేశం పంపిస్తోంది. ఇందుకోసం ప్రవాస భారతీయుల కార్యదర్శి రమణారెడ్డి నేతృత్వంలోని బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న బాధితులలో 25 మందికి స్వదేశం వచ్చేందుకు ఉచితంగా విమాన టిక్కెట్లు అందించింది. ఈ రోజు సాయంత్రం మరో 85మంది బాధితులకు కూడా ఉచితంగా విమాన టిక్కెట్లు అందించనున్నట్లు అధికారులు  తెలిపారు.

  • Loading...

More Telugu News