: బీజేపీ 'బల' సభ
భారతీయ జనతాపార్టీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హాజరై ప్రసంగించనున్నారు. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఈ సభలోనే అధికారికంగా బీజేపీలో చేరబోతున్నారు. తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నేతలను కూడా ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 2014 ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణకు ముందు నుంచీ అనుకూలంగా పోరాడుతున్నందున ఈ ప్రాంతంలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం తెలంగాణ జేఏసీ నేతలకు కూడా టిక్కెట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని తేలిపోయిందని, ఇక ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ ఎలా సాధ్యమో చెప్పాలని నాగం ప్రశ్నించారు. బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని, టీఆర్ఎస్ లో చేరే నేతలు ఒకసారి ఆలోచించాలని కోరారు.