: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా దాల్మియా


బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. చెన్నైలో జరుగుతున్న సమావేశంలో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షపదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ, జగ్ మోహన్ దాల్మియా పేరును ప్రతిపాదించారు. దీంతో అందరు సభ్యులు అంగీకరించినట్టు తెలుస్తోంది.

గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన దాల్మియా శరద్ పవార్ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అయినా సరే దాల్మియాకు వ్యతిరేకత వ్యక్తం కాలేదు. దీంతో నేటినుంచి దాల్మియా బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు. సమావేశంలో సంజయ్ జగ్దాలే, అజయ్ షిర్కే ల రాజీనామాను ఉపసంహరించుకోవాలని బీసీసీఐ వర్కింగ్ కమిటీ కోరింది. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు దాల్మియాతో శ్రీనివాసన్ మూడు గంటల పాటు సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News