: అక్బరుద్దీనుకు బెయిల్ మంజూరు


మత విద్వేషాలు చెలరేగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలైన ఎంఐఎం నేత అక్బరుద్దీనుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అక్బర్ బెయిల్ పిటిషనును స్వీకరించిన నిజామాబాద్ న్యాయస్థానం 10వేల రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగ సభలో అక్బర్ విద్వేష పూరిత ప్రసంగంతో దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు చెలరేగడంతో పాటు పలు చోట్ల కేసులు నమోదయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News