: టోర్నడోల బీభత్సం
అమెరికాలోని ఓక్లహామ రాష్ట్రంలో మరోసారి టోర్నడోలు విరుచుకుపడ్డాయి. గడచిన వారం రోజుల్లో రెండోసారి టోర్నడోలు ఓక్లహోమ నగరంపై దాడి చేసాయి. ఈ టోర్నడోల వల్ల గంటకు 128 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వీటి ధాటికి నగరం అతలాకుతలమైపోయింది. పలు నివాస, వ్యాపార సముదాయాలు నేలకూలాయి. తల్లి, పసిబిడ్డ సహా మరో 9 మంది చనిపోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక విల్ రోగెల్స్ విమానాశ్రయంలో విమాన సర్వీసులన్నీ నిలిపేశారు. ప్రయాణీకులందరికీ ప్రత్యేక రక్షిత కేంద్రాల్లో వసతి కల్పించారు. నగరానికి సమీపంలో ఉండే ముస్తాంగ్, సెయింట్ లూయిస్ నగరానికి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.