: అది రైనానా? లేక ధోనీనా?


బీసీసీఐని స్పాట్ ఫిక్సింగ్ వివాదం వీడకముందే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మరో బాంబు పేల్చారు. 2010 శ్రీలంక టూర్ లో జరిగిన అక్రమాలను బయటపెట్టారు. శ్రీలంక బోర్డు ఇచ్చిన నివేదిక ఉపసంహరణకు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. ఆ టూర్ కు భారత జట్టుతో పాటు జట్టులోని అధికారి ఒక అమ్మాయిని జట్టువెంట తీసుకెళ్లారట. ఆ అమ్మాయి కొలంబో హోటల్లో జట్టులోని సీనియర్ ఆటగాడితో రాత్రంతా గడిపిందని నివేదికలో శ్రీలంక ఆర్మీ జనరల్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు నివేదిక కూడా ఇచ్చారు. అదే నివేదికను ఐసీసీకి కూడా పంపారు. అయితే ఆ నివేదికను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని కూడా తెలిపారు. ఈ సీనియర్ ఆటగాడు గత 6 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా కొనసాగుతున్నాడట. అంటే చెన్నై జట్టులో కొనసాగుతున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రైనా, ధోనీ. మరి, ఇంతకీ ఎవరా మొనగాడు?

  • Loading...

More Telugu News