: పార్టీని వీడిన వారంతా బేరాలాడే వెళ్లారు: ఆజాద్


పార్టీని వీడిన వారంతా బేరసారాలు ఆడి వెళ్లిన వారేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ అన్నారు. సీనియర్ నేత కేశవరావు, మాజీ మంత్రి వినోద్, పార్టీ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం టీఆర్ఎస్ లో ఈ రోజు చేరుతున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆజాద్ స్పందించారు. పార్టీ నుంచి వెళ్లే వారికి తెలంగాణ కంటే కుటుంబ సభ్యులు, తమ రాజకీయ భవిష్యత్తుపైనే ప్రేమ ఎక్కువన్నారు. తెలంగాణపై మరికొన్ని సమావేశాలను నిర్వహించి ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News