: ఫిలిప్పీన్స్ లో భూకంపం
దక్షణ ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.7 నమోదైంది. భూప్రకంపనలతో కర్మెన్ ప్రాంతంలో రెండు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడడంతో 8 మంది చిన్నారులు గాయపడ్డారు. కిమద్ జిల్ గ్రామంలో వంతెనతోపాటు నాలుగు పాఠశాల భవనాలు కూలిపోయాయి. ప్రాణనష్టంపై ఇంకా పూర్తి అంచనాకు రాలేదు. అయితే ఆస్థి నష్టం సంభవించింది.