: భద్రగిరికి పోటెత్తుతున్న హనుమాన్ దీక్షాపరులు


రేపు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్తుల రాక ప్రారంభమైంది. 45 రోజుల పాటు దీక్షలో స్వామిని సేవించిన భక్తులు హనుమాన్ జయంతి రోజునే తమ దీక్షను విరమిస్తారు. దీంతో దీక్షాపరులు భారీ సంఖ్యలో భద్రాద్రికి చేరుకుంటున్నారు. పవిత్ర గోదావరిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. రేపటి వరకూ సుమారు లక్ష మంది భక్తులు స్వామి దర్శనానికి విచ్చేస్తారని అంచనా.

  • Loading...

More Telugu News