: త్వరలో మూడు శతాబ్ది రైళ్లు
రాష్ట్రవాసులకు శుభవార్త. మూడు శతాబ్ది రైళ్లు రాష్ట్రంలో కొత్తగా పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కర్నూలు, తిరుపతికి శతాబ్ది రైళ్లను త్వరలో ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖా సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. కర్నూలు రైల్వే స్టేషన్లో నాల్గవ ప్లాట్ ఫామ్ నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.