: ఇక రక్తదానం అవసరం ఉండదు!
ఇక రక్తదానాలు చేయాల్సిన అవసరం ఉండదు... ఎందుకంటే రక్తం కావాల్సిన వ్యక్తికి ఈ కొత్తరకం రక్తాన్ని ఎక్కించేస్తే సరి... బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు పరీక్ష నాళికలో అసంఖ్యాకమైన ఎర్రరక్తకణాలను సృష్టించే ఒక నూతన విధానాన్ని కనుగొన్నారు. ఈ కొత్తరకం రక్తంతో భవిష్యత్తులో రక్తదానాల అవసరం ఉండదని వారు భావిస్తున్నారు.
చర్మం, రక్తకణాల నుండి ఉత్పత్తి చేసే పూర్తిగా పరిణతి చెందిన సోమాటిక్ కణాల నుండి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ మూలకణాలను (ఐపీఎస్)సేకరిస్తారు. వీటినే మూలకణాలుగా ఉపయోగించి పరీక్ష నాళికలో రక్తకణాలను తయారు చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు... ఏ గ్రూపు రక్తానికి తగినట్టుగా ఆ గ్రూపు ఎర్రరక్తకణాలను తయారు చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.