: మోడీ యేనా? చౌహానూ మొనగాడే: అద్వానీ
బీజేపీ అగ్రనేత అద్వానీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీని తిరస్కరిస్తున్న అద్వానీ మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా గ్వాలీయర్ లో మాట్లాడుతూ వాజ్ పేయిలా శివ్ రాజ్ సింగ్ చౌహాన్ కూడా వినయవంతుడని అన్నారు. భారతదేశం అంతర్జాతీయంగా సమున్నత స్థానం పొందడంలో చౌహాన్, మోడీ కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. లాడ్లీలక్ష్మి, ముఖ్యమంత్రి తీర్ధ్ దర్శన్ యోజన వంటి పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా అమలు చేసారని చౌహాన్ ను అభినందించారు. అంతే కాకుండా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని మోడీ సుసంపన్నం చేస్తే, చౌహాన్ నిరుపేద రాష్ట్రాన్ని అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చారని అన్నారు. దీంతో ప్రధాని రేసులో మోడీ కంటే చౌహానే మెరుగు అని పరోక్షంగా వ్యాఖ్యానించడం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.