: శ్రీలంక భారీ స్కోరు... భారత్ విజయలక్ష్యం 335


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహక మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు అద్భుత ఆరంభాన్నిచ్చారు ఫెరీరా(82), దిల్షాన్(84). వీరిద్దరూ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో తొలి వికెట్ కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తరువాత వచ్చిన బ్యాట్స్ మన్ కూడా మంచి స్కోర్లు సాధించడంతో్ శ్రీలంక 334 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది. ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయిన జయవర్ధనే(30), సంగక్కర(45) పరుగులు సాధించగా, తిషార పెరీరా 26 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లు చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయనప్పటికీ భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు. 335 పరుగుల విజయ లక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పై భారత జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.

  • Loading...

More Telugu News