: పాక్ లో 14 ఏళ్ల తరువాత ప్రమాణస్వీకారం
పాకిస్థాన్ పార్లమెంటుకు ఇటీవల ఎన్నికైన సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేసారు. పదవీచ్యుతుడైన తరువాత ఎన్నికలు నిర్వహించాలని నవాజ్ కోరినా ముషారఫ్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టడం, తరువాత దేశబహిష్కరణ విధించడంతో నవాజ్ పాక్ పార్లమెంటులోపలికి 14 ఏళ్లుగా అడుగుపెట్టలేదు. దీంతో తాజా ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పీఎంఎల్-ఎన్ పార్టీ అద్యక్షుడి హోదాలో పార్లమెంటులో అడుగుపెట్టారు. దీంతో నవాజ్ షరీఫ్ 14 ఏళ్ల సుధీర్ఘ విరామానికి శుభం పలికారు. నవాజ్ షరీఫ్ పదవీ భాధ్యతలు చేపట్టడాన్ని భారత పాలకులు స్వాగతించారు.