: ప్యాకేజీల కోసమే పార్టీల మార్పు: పొంగులేటి


వ్యక్తిగత అజెండాలతోనే పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి టీ కాంగీ ఎంపీలను విమర్శించారు. రాజకీయ క్విడ్ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుపెట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? అని ఆ పార్టీలో చేరిన టీ కాంగ్ ఎంపీలను సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన దగ్గుబాటి, సుబ్బరామిరెడ్డి పరస్పర విమర్శలు తగ్గించుకోవాలని సూచించారు. సీట్ల అంశం పార్టీ చూసుకుంటుందని ఆయన సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News