: బాబు క్షమాపణ చెబితే టీఆర్ఎస్ విలీనం గురించి ఆలోచిస్తాం: హరీష్ రావు
'టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేస్తామన్న హరీష్ రావుకు అభినందనలు' అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. టీడీపీలో టీఆర్ఎస్ విలీనంపై తాను చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి అర్ధం కానట్టుందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు జై కొడుతూ తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెబితే, అప్పుడు టీడీపీలో విలీనం గురించి అలోచిస్తామన్నారు. టీడీపీ తమ ప్రధాన డిమాండ్లను మర్చిపోయినట్టుందని వారు తమ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.