: డిపాజిట్ చేస్తున్నారా... అయితే జాగ్రత్త: ఆర్ బీఐ
ఎన్ బీఎఫ్ సీ(బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు) కంపెనీలలో డిపాజిట్లు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. డిపాజిట్ తీసుకుంటున్న కంపెనీకి ఆర్ బీఐ గుర్తింపు ఉందా? డిపాజిట్ల స్వీకరణకు అనుమతి ఉందా? లేదా? అన్నవి సరిచూసుకోవాలని తెలియజేసింది. అప్పుడే పెట్టుబడులకు రక్షణ లభిస్తుందని పేర్కొంది. ఇటీవలే పశ్చిమబెంగాల్లో 'శారదా చిట్ ఫండ్' కంపెనీ వేలాది మందికి టోపీ పెట్టడం, దేశవ్యాప్తంగా పలు కంపెనీల మోసాలు వెలుగు చూస్తుండడంతో ఆర్ బీఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.