: ఇన్ఫోసిస్ లోకి మళ్లీ నారాయణ మూర్తి


ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు ఆయనను ఎన్నుకుంది. నెలకు రూపాయి వేతనంతో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆయన సేవలు అందించనున్నారు. 2011లో నారాయణమూర్తి కంపెనీ బాధ్యతలను సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి అప్పగించి తప్పుకున్నారు. ఆ తర్వాత నందన్ నీలేకని ఆధార్ కార్డ్ ప్రాజెక్టు యునిక్యూ ఐడెంటిఫికేషన్ నంబర్ అథారిటీ చైర్మన్ గా వెళ్లిపోవడంతో ఇన్ఫోసిస్ పనితీరు రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది.

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలలో ఇన్ఫోసిస్ మినహా మిగతావి చక్కటి ఫలితాలు ప్రకటించగా.. ఇన్ఫోసిస్ మాత్రం పేలవమైన ఫలితాలతో ఆకట్టుకోలేకపోయింది. నారాయణమూర్తి, నందన్ నీలేకని లేకపోవడంతో కంపెనీ సామర్థ్యం సన్నగిల్లిందని విశ్లేషణలు వెలువడ్డాయి. కొంత మందైతే ఇక ఇన్ఫోసిస్ ది గతమెంతో ఘన చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు. తాను స్థాపించిన కంపెనీ ప్రభ తగ్గుతుండడంతో నారాయణమూర్తే చొరవ తీసుకుని మళ్లీ కంపెనీలోకి ప్రవేశించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News