: కష్టమైన పని ఇవ్వండంటూ సంజయ్ దత్ వేడుకోలు!
"అయ్యా వంటికి శ్రమ కల్పించే, కష్టమైన పని అప్పగించండి చేస్తాను. ఏ పనీ లేకుంటే రాత్రివేళల్లో మంచిగా నిద్ర పట్టడం లేదు" అంటూ పుణెలోని ఎరవాడ జైలు అధికారులకు ఖైదీ సంజయ్ దత్ వేడుకుంటున్నాడు. భద్రతా పరమైన కారణాల వల్ల సంజయ్ అభ్యర్థనను జైలు అధికారులు సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. 1993 బాంబుపేలుళ్ల కేసులో శిక్షపడ్డ సంజయ్ ను మే 22న ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. అప్పటి నుంచీ సంజయ్ దత్ కు జైలు అధికారులు ఎటువంటి పనీ అప్పగించట్లేదు.
దీనిపై జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ మాట్లాడుతూ.. "సంజయ్ దత్ ప్రాణానికి జైలులో ముప్పు ఉందంటూ ఇప్పటికే పలు ఏజెన్సీల నుంచి మాకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సంజయ్ మిగతా ఖైదీలతో కలవడానికి అవకాశం లేదు. అందుకే ఆయనకు శ్రమతో కూడిన పని కల్పించలేకున్నాం" అని చెప్పారు. పాపం సంజయ్ కు కంటిమీద మంచి కునుకు కరవాయెనే!