: కర్ణాటకలోనూ నిషేధానికి గురైన గుట్కా
ఆరోగ్యానికి తీవ్ర హాని చేకూర్చే గుట్కాలను పొరుగునున్న కర్ణాటక కూడా నిషేధించింది. రసాయనాలతో కూడిన పొగాకు ఉత్పత్తులను నిషేధించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఖాదర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికే గుట్కాలను మన రాష్ట్రంతోపాటు పొరుగునున్న తమిళనాడు, మహారాష్ట్ర కూడా నిషేధించాయి. అయినా కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి గుట్కాల అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ కూడా నిషేధం విధించినందున అక్రమ రవాణాకు కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 22 రాష్ట్రాలు గుట్కాలను నిషేధించాయి.