: కేసీఆర్ పై ఖమ్మంలో కేసు
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ ష్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల ప్రకారం పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను వాచ్ మెన్ కంటే అధ్వానం అంటూ ఆయనను, ఆయన పదవిని కించపరుస్తూ మాట్లాడినందున కేసీఆర్ పై కేసు నమోదుకు ఆదేశించాలంటూ ఖమ్మం కోర్టులో స్థానిక న్యాయవాది రామారావు కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన ఫస్ట్ క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలంటూ పోలీసులను రెండు రోజుల కిందట ఆదేశించారు.