: రుతుపవనాల ఆగమనం
అవిగవిగో రుతుపవనాలు... కేరళ సమీపానికి వచ్చేశాయి. ఆదివారం సాయంత్రానికి కేరళ తీరాన్ని తాకుతాయి. అటుపై నెమ్మదిగా తమిళనాడు, ఆంధ్రవైపు అడుగులు వేస్తాయి. అంచనాలకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో జూన్ 10 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో చాలా వరకూ రుతుపవనాల విస్తరణ పూర్తయిందని తుపాను హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.