: తాళానికి చెల్లు... సెల్లుతో వెళ్లు...!


మీరు బయటికి ఎక్కడికైనా వెళ్లేటపుడు తాళం ఎక్కడ పెట్టామో గుర్తుపెట్టుకుని దాన్ని తలుపుకు వేసి ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకొని వెళ్తారు కదూ... అయితే మీరు గనుక ఈ కొత్త తాళాన్ని మీ తలుపుకు అమరిస్తే... ఎంచక్కా మీరు తాళం వేయాల్సిన పనిలేదు... ఎందుకంటే మీ చేతిలోని సెల్‌ఫోన్‌ మీ ఇంటికి తాళం వేసేస్తుంది... అమెరికాకు చెందిన జాసన్‌ జాన్సన్‌, వెస్‌బెహార్‌లు మీ సెల్లుతోనే ఇంటికి తాళం వేసేయొచ్చు అంటున్నారు.

వీరు ఒక ఫోన్‌ అప్లికేషన్‌ను తయారు చేసి, దాని సాయంతో 'ఆగస్ట్‌' అనే ఆధునిక తాళాన్ని తయారుచేశారు. ఈ 'నవతాళాన్ని' తలుపు లోపల అమరిస్తే మీరు ఇలా బయటికి వెళ్లగానే తాళం దానంతట అదే పడిపోతుంది. తిరిగి బయటి నుండి మీరు వచ్చి, తలుపు వద్ద నిలబడగానే తాళం దానంతట అదే తిరిగి తెరుచుకుంటుంది. అంటే, ఈ కొత్త తాళంతో తాళం వేయడం, మళ్లీ తీయడం వంటి బాదరబంది ఉండదు. ఇదంతా కూడా ఆగస్ట్‌లో అమర్చిన సెన్సర్లు, బ్లూటూత్‌ ద్వారా సెల్‌ఫోన్‌లో అనుసంధానం చేయడం వల్ల జరుగుతుంది. ఒకవేళ మనం లేనపుడు మన ఇంటికి చుట్టాలో, స్నేహితులో వచ్చారకుకోండి... అప్పుడు మనం వాళ్లని ఇంట్లో కూర్చోమనాలనుకుంటే... మన ఫోన్‌లోని అప్లికేషన్‌ను వారి ఫోన్‌కు పంపిస్తే... అప్పుడు వారికి కూడా మన తలుపు తెరుచుకుంటుంది... ఈ కొత్త సెల్‌తాళం ఆగస్ట్‌ను ఈ ఏడాది చివరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు జాన్సన్‌, బెహార్‌లు అంటున్నారు. అన్నట్టు ఈ 'నవతాళ్‌' ధర రూ.10,500 మాత్రమే...!

  • Loading...

More Telugu News