: యుఎస్‌బి సృష్టికర్తకు ఘనగౌరవం
కంప్యూటర్లతో ఏమాత్రం పరిచయం ఉన్నా... అలాంటి వారందరికీ చిరపరిచితమైన పరికరం... పేరు యుఎస్‌బి. యూనివర్సల్ సీరియల్ బస్. దీనితో ఎన్నో చేయొచ్చు. అయితే దీన్ని సృష్టించింది ఎవరో కాదు... మన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అజయ్‌భట్. అమెరికాలోని ఇంటెల్ కార్పొరేషన్‌లో అజయ్ నేతృత్వంలోని సాంకేతిక శాస్త్రవేత్తల బృందం యూఎస్‌బీ టెక్నాలజీని అభివృద్ధి పరచింది.
కంప్యూటర్‌కు సంబంధించి వెబ్‌కామ్‌లు, మొబైల్ ఫోన్లు, కెమెరాలు, మ్యూజిక్ ప్లేయర్లు, పెన్‌డ్రైవ్‌లు ఇలా ఒకటేంటి... చాలా వరకూ కంప్యూటర్‌కు సంబంధించిన వస్తువులను ఆ కంప్యూటర్‌కు అనుసంధానం చేయాలంటే యూఎస్‌బీ ఉండాల్సిందే. కంప్యూటర్‌లో సిలికాన్ చిప్ తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ పరికరం.
కాగా అమెరికాలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించిన వారికి ఇచ్చే యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2013ను యూరోపియన్ పేటెంట్ కార్యాలయం అజయ్ బృందానికి ఇచ్చింది. యూఎస్‌బీని రూపొందించి వీరి బృందం సాధించిన ఘనతకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. వడోదరలో డిగ్రీ పూర్తిచేసి, న్యూయార్క్‌లో పీజీ చేసిన 56 ఏళ్ల అజయ్ 1990లో ఇంటెల్ సంస్థలో చేరారు. ఆయనకు 31 అమెరికనన పేటెంట్లున్నాయి.