: టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణవాదులవుతారా?: బీజేపీ


కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ లో చేరడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఉద్యమం మరింత బలపడుతుందంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, కాంగ్రెస్ నేతలు వారు, వారి వారసుల స్వార్ధ ప్రయోజనాలకోసం పార్టీని వీడారని చెబుతున్నారు. తాజాగా 'వేయి మంది చావుకి కారణమైన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ వాదులవుతారా?' అని బీజేపీ ఉద్యమకమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని రాజేశ్వరరావు విమర్శించారు.

  • Loading...

More Telugu News