: నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు
ఛత్తీస్ గఢ్ ఘటన తరువాత నక్సల్ ప్రభావిత రాష్ట్రాల భద్రతపై కేంద్రం మరింత శ్రద్ధ పెట్టనుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని భద్రతా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జూన్ 5న ఢిల్లీలో జరుగనుంది. అంతర్గత భద్రతపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా నక్సల్ ప్రభావిత 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో నక్సల్ హింసను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ జరుపనున్నారు.