: బాబు ఆదేశిస్తే తెనాలి నుంచి బరిలోదిగుతా: ఏవీఎస్
టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు ఆదేశిస్తే తెనాలి నుంచి పోటీ చేస్తానని సినీ నటుడు ఏవీఎస్ తెలిపారు. 12 ఏళ్లుగా టీడీపీలో తాను క్రియాశీలకంగా ఉన్నట్టు తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఏవీఎస్, రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రానికి సుపరిపాలన, ఉత్తమ నాయకత్వం కావాలంటే చంద్రబాబు నాయుడును ఎన్నుకోక తప్పదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటూ మిగతా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని తెలిపారు.