: స్పాట్ ఫిక్సింగ్ లో వెలుగు చూస్తున్న సంచలనాలు


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. పోలీసు దర్యాప్తు, విచారణ సందర్భంగా మరిన్ని నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ జరిగే అవకాశముందని, అందులో భాగస్వాములు కీలక వ్యక్తులేనని ముందుగానే ఐసీసీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును హెచ్చరించింది. ఆ విషయాలపై విందూ సింగ్ ను గురునాథ్ ముందుగానే 'మనపై నిఘా మరింత పెరుగుతుంది ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల'ని హెచ్చరించాడన్న విషయం టేపుల్లో బయటపడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హెచ్చరికల్ని బీసీసీఐ పెడచెవిన పెట్టింది. కాగా, శ్రీనివాసన్ అండ చూసుకుని గురునాథ్ విచ్చలవిడిగా బెట్టింగులు కాసాడని, విందూ దారా సింగ్ తో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News