: వాయు సేన కలనెరవేరింది: జితేంద్రసింగ్
స్విట్జర్లాండ్ కు చెందిన యుద్దవిమానాల చేరికతో వాయుసేన దీర్ఘకాలిక కలనెరవేరిందని రక్షణశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విమానాల కొనుగోలుతో ఎయిర్ ఫోర్సులో చేరిన పైలట్లకు అతర్జాతీయ స్థాయి ప్రమాణలతో కూడిన శిక్షణ ఇచ్చే అవకాశం కలిగిందన్నారు. పిలాటన్ పీసీ-7 శిక్షణ విమానాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన వాయుసేనలు వినియోగిస్తున్నాయని, ఇప్పడు ఈ విమానాల సేవలు భారతదేశానికి అందించనున్నాయని తెలిపారు. అనంతరం వాయుసేన శిక్షణార్థులకు 10 పిలాటన్ విమానాలను అప్పగించి, ఓ విమానంలో విహరించారు. మరో ఏడాదిలోగా పిలాటన్ సంస్థ 75 విమానాలు అందజేయనుందని తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్ ల నుంచి ఆధునిక యుద్దవిమానాలను, రవాణ హెలికాప్టర్లు మరిన్ని కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. భారత వాయుసేనా విభాగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రక్షణశాఖాధికారులు ప్రణాళికలు సిద్దం చేసారు.