: గురునాథ్, విందూ పోలీసు కస్టడీ పొడిగింపు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన గురునాథ్ మెయ్యప్పన్,విందూ దారాసింగ్ సహా మరో ఇద్దరికి ముంబై కోర్టు పోలీసు కస్టడీ పొడిగించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కానందున మరింత లోతైన విచారణ అవసరం అని న్యాయస్థానానికి పోలీసులు తెలపడంతో, కోర్టు వీరి కస్టడీని జూన్ 3 వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో పోలీసులు వీరిని మరింతగా విచారిస్తారు.