: మరి ఉద్యమం కోసం త్యాగాలు చేసినవార్నేం చేస్తారు? : టీడీపీ నేత పెద్దిరెడ్డి
కేసీఆర్ ప్రాంతీయవాదం కంటే వలసలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని టీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టికెట్లకు ఇతరపార్టీ నేతలు కావాలీ, ఇదేనా ఉద్యమ స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నిచారు. ఉద్యమం కోసం పనిచేసిన వారిని ప్రోత్సహించరా? అని ఆయన సూటిగా అడిగారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ కోరుకుంటే టీడీపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి నేతల వలసలను ప్రోత్సహిస్తుంటే, మరి ఇంతవరకూ తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వారిని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఉద్యమవీరులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారని అడిగిన పెద్దిరెడ్డి, భవిష్యత్తులో టీఆర్ఎస్ లో సంక్షోభం వస్తుందని అభిప్రాయపడ్డారు.