: ఆధార్ కార్డులపై కుక్కలు, చెట్లుంటాయి జాగ్రత్ర!
ఆధార్ కార్డు ప్రక్రియ అంతా పకడ్బందీ అంటారు. పది చేతివేళ్ల ముద్రలు, కంటిపాపలు, ఫొటోలు, వివరాలు అన్నీ కలిస్తే ఆధార్ కార్డు. దీంతో నకిలీలను ఏరిపారేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశలు. ఆధార్ కార్డుల కోసం కుటుంబంలో ప్రతీ ఒక్కరూ విధిగా కేంద్రం వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకోవాలి. చిత్రమేమిటంటే ఎన్ని ఉన్నా సరే ఆధార్ కార్డులలో మనుషుల ఫొటోలకు బదులు కుక్కలు, చెట్ల దృశ్యాలు ఉన్నవి కూడా బయటపడ్డాయి. దీనిపై యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ దాల్వాయి స్పందించారు. సిస్టం సరైనదే.. కాకపోతే కొన్ని తప్పులున్నాయని చెప్పుకొచ్చారు. ఆపరేటర్ల తప్పిదాల వల్ల ఇలా కుక్క, చెట్ల బొమ్మలు వచ్చి ఉంటాయన్నారు. ఇలాంటి లోపాలను వెతికి పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.