: పెళ్లయితేనే పరమానందం!
'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. భర్తగ మారకు బ్యాచులరూ.. షాదీ మాటే వద్దు గురూ సోలో బతుకే సో బెటరూ..'
'వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా' ఈ రెండు గీతాలూ పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా బతకడమే నయమని చెబుతున్నాయి. కానీ, అంతపని చేయకండి. పెళ్లితోనే నిండు నూరేళ్లు ఆనందంగా, సంతోషంగా ఉండగలరు.
అవునండీ.. ఇది మేము చెబుతున్నది కాదు... శాస్త్ర వేత్తలు పరిశోధన చేసి మరీ 'పెళ్లే సో బెటరూ' అని చెబుతున్నారు. వివాహం మనిషి జీవితాన్ని నూతన దిశలకు తీసుకెళుతుంది. జీవితానికి పరిపూర్ణత ఇస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన తాత, తండ్రులను అడిగినా ఇదే చెబుతారు.
కానీ, ఇటీవలి కాలంలో సామాజిక, ఆర్థిక పరంగా వచ్చిన మార్పులతో ఒంటరి జీవితాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి పీటలు ఎక్కేవారు తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిస్సోరీ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయన ఫలితాలను తప్పక తెలుసుకోవాలి.
వివాహం శారీరక, మానసిక పరంగా ఎన్నో మార్పులకు కారణమవుతుందని వీరు గుర్తించారు. పెళ్లయ్యాక దంపతులు తగవులాడుకోకుండా అన్యోన్యంగా ఉంటే భూలోకంలోనూ స్వర్గ సుఖాలను అనుభవించవచ్చని చెబుతున్నారు. పరస్పర అవగాహనతో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వివాహ బంధాన్ని కొనసాగిస్తున్న వారిలో వృద్ధాప్యం మీద పడినా.. నవ యవ్వనుల్లా, ఆనందంగా, చెలాకీగా ఉంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. భార్యా భర్తల మధ్య సఖ్యత, సంతోషం ఉంటే అనారోగ్యం కూడా ఆమడ దూరం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అందుకే బ్రహ్మచారిగా బతికేయకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి జీవితాన్ని ఆనంద, ఆరోగ్యమయం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి, సినీ కవులు చెప్పినట్లుగా పై పాటలు పాడుకోకుండా పెళ్లిపీటలు ఎక్కేయండి. శుభమస్తు!