: టీవీ సీరియల్లో నటిస్తున్న అమితాబ్ బచ్చన్


వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టారే. అందులో సందేహమే లేదు. 'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమాన్నినిర్వహించి, విజయవంతం చేసిన తీరు దేశవ్యాప్తంగా ఆయనకు విశేష ప్రజాదరణ సంపాదించి పెట్టింది. ఇప్పుడు మరోసారి బిగ్ బి బుల్లితెరపై కనిపించనున్నారు. అయితే ఈసారి ఏకంగా సీరియల్లో నటించేందుకు బాలీవుడ్ దిగ్గజం ఓకే చెప్పాడట.

అమితాబ్ అభిమానులకు ఇది నిజంగా తియ్యటి కబురే! ఎందుకంటే, 'కౌన్ బనేగా..' కార్యక్రమం వారానికి ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు అమితాబ్ సీరియల్లో నటిస్తుండడంతో తమ ఆరాధ్య హీరోను ఫ్యాన్స్ రోజూ చూడవచ్చు. అమితాబ్ స్వంత సంస్థ ఎబీసీఎల్ ఈ సీరియల్ నిర్మాణంలో భాగస్వామి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సీరియల్ డిసెంబర్ నాటికి వీక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News