: కొత్త ఆస్టరాయిడ్లున్నాయి
గ్రహాల మధ్య తిరిగే 28 కొత్త ఆస్టరాయిడ్ కుటుంబాలను నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన వైడ్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ (డబ్ల్యూఐఎస్‌ఈ)ని ఉపయోగించి వీటిని గుర్తించారు. గ్రహాలు ఢీకొనడం వంటి ఘటనల కారణంగా ఇవి ఏర్పడి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.
అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఈ ఆస్టరాయిడ్ కుటుంబాలను గుర్తించడం వల్ల భూమికి సమీపంగా వచ్చే ఆస్టరాయిడ్ల మూలాలను గుర్తిండంతోబాటు భూమికి వాటివలన కలిగే ముప్పును గురించి కూడా అవగాహన చేసుకోవడం సాధ్యమవుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న జాన్సన్ అంటున్నారు.