: మీ సామర్ధ్యమే మీకు బలం


ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అది మీ సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. మాతృభాష కాకుండా మరోభాషను అదనంగా నేర్చుకోవాలంటే అది పూర్తిగా మీ వ్యక్తిగత సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

హీబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు భాషాభ్యసనం గురించి కొందరు విద్యార్ధులను ఎంపిక చేసుకుని వారిని మూడు బృందాలుగా విభజించి పరీక్షించారు. ఈ పరీక్షలో భాషాభ్యసనంలో కేవలం వ్యక్తిగత ప్రతిభ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని తేలిందని పరిశోధకులు తేల్చారు. భాషాభ్యసనంలో ఒక్కో భాషపై ఒక్కొక్కరికి ఆసక్తి ఉంటుందని, దాని ఆధారంగానే వారి అధ్యయనా సామర్ధ్యం పెరుగుతుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. అయితే నేర్చుకునే విషయంలో మాత్రం ఇలాంటి ప్రత్యేకతలు ఉండవనీ, కేవలం భాషాధ్యయన సామర్ధ్యమే గీటురాయి అని హీబ్రూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News