: వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లాను: షిండే


గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సమాధానమిచ్చారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన నరమేధానికి హోం మంత్రి కనీసం స్పందించలేదని బీజేపీ విమర్శించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు దాడిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు షిండే తెలిపారు. తానింత కాలం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లానన్నారు. తన బాధ్యతలను మర్చిపోలేదని, ఎప్పటికప్పడు అధికారులకు సూచనలు సలహాలు అందజేస్తూనే ఉన్నానని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు.

  • Loading...

More Telugu News