: ఎలక్షన్ల ఏడాది భారీ బడ్జెట్ కు ప్రణాళికాసంఘం ఆమోదం
2013-14 ఆర్థిక సంవత్సరానికి 53 వేల కోట్లతో రాష్ట్ర ప్రణాళిక ఖరారైందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు, పలు ప్రభుత్వ పథకాల అమలుకు నిధులను సమకూర్చాలని విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మాంటెక్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి, ఇందిరమ్మ కలలు, ఎస్సీఎస్టీ ఉప ప్రణాళిక పథకాలు బాగున్నాయన్నారు. ఈ పథకాల అమలుతీరు, ఫలితాలు పరిశీలించాక దేశవ్యాప్త విస్తరణకు పరిశీలిస్తామని తెలిపారు. రానున్నది ఎన్నికల ఏడాది కనుక రాష్ట్రప్రభుత్వంపై అవ్యాజమైన ప్రేమను కేంద్రం కురిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.