: బాబు ఆరోపణలు అవాస్తవాలు: జైళ్ల శాఖ డీజీ


జైళ్లలో ఉండే నిందితులు, ఖైదీలు మద్యం తాగడంతో పాటూ వినోదం కోసం నీలి చిత్రాలను చూస్తున్నారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను జైళ్లశాఖ డీజీ కృష్ణంరాజు ఖండించారు. చంచల్ గూడ జైలు ను జగన్ కార్యాలయంగా మారుస్తున్నామనడం పూర్తిగా అవాస్తవమన్నారు. జైలు నుంచే సెటిల్ మెంట్లు, హత్యలు చేయిస్తున్నారని అనడం సరికాదన్న ఆయన, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జైళ్లకు మంచి పేరుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ రూల్స్ 1979 ప్రకారం జగన్ కు స్పెషల్ క్లాస్ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలు మాత్రమే కల్పిస్తున్నామని నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని, ములాఖత్ విషయంపై ఇప్పటికే టీడీపీ ఇన్ఫర్మేషన్ యాక్టు ప్రకారం సమాచారం సేకరించిందని గుర్తుచేసారు. నిరాధార ఆరోపణలు చేయడం బాబుకు తగదని కృష్ణంరాజు సూచించారు.

  • Loading...

More Telugu News