: పార్లమెంటు బులెటిన్ లో ఎన్టీఆర్ జయంతి ప్రకటన ఏది?: నామా


పార్లమెంటు బులెటిన్ లో ఎన్టీఆర్ జయంతి అధికారిక ప్రకటన జారీకాలేదని స్పీకర్ మీరాకుమారి దృష్టికి తెచ్చారు టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు. భవిష్యత్తులో అలా జరుగకుండా పార్లమెంటు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలంటూ విజ్ఞప్తి చేసారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మొన్ననే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఆవరణలో ఉన్న దిగ్గజాల విగ్రహాలకు వారి వారి జయంతి రోజున పార్లమెంటు సభ్యులు ఘనంగా నివాళి అర్పించడం అనవాయతీ. మరోసారి ఈ తప్పిదం జరుగకుండా చూడాలని, యావత్ తెలుగు జాతీ గౌరవించే మహానుభావుడు ఎన్టీఆర్ ను స్మరించుకోవడం సముచితమని స్పీకర్ కు రాసిన లేఖలో నామా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News