: ఆ భారతీయులు రేపిస్టులు కారు: న్యూజిలాండ్ కోర్టు


న్యూజిలాండ్ లో రెండేళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో హమిల్టన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులు నిర్దోషులుగా బయటపడ్డారు. వీరిని త్వరలోనే స్వదేశానికి పంపనున్నారు. 2011 ఏప్రిల్ 16 న రొటొరువా వెళ్లేదారిలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న అభియోగంతో హర్వీందర్ సింగ్, కమల్ జీత్ సింగ్, సుమిత్ వెర్మానీ అరెస్టయ్యారు. ఏడుగురు మహిళలు, ఐదుగురు పురుషలతో కూడిన జ్యూరీ కేసుపై విచారణ జరిపి అత్యాచారానికి పాల్పడలేదని చెబుతూ, ముగ్గురినీ నిర్ధోషులుగా తేల్చింది. నాలుగో నిందితుడు అమిర్ చాంద్ ను ముందుగానే విడుదల చేయడంతో ఇప్పటికే స్వదేశం చేరాడు.

  • Loading...

More Telugu News