: విజయనగరంలో అక్రమార్కుల దారుణాలు


విజయనగరం జిల్లా కుంభకోణాలలో రికార్డు సృష్టిస్తోంది. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ గత నెలలో రైతుల పేరిట వారికి తెలియకుండానే బ్యాంకులో వాళ్ళ పేర అప్పులు తీసుకుని వాడేసుకుంది. తీరా కోర్టు నుంచి, బ్యాంకు నుంచి నోటీసులొస్తే కానీ రైతులకు అసలు విషయం తెలియలేదు. విషయం తెలుసుకుని ఆందోళన చేస్తే, 'మీరు కంగారు పడకండి. మేమే చెల్లిస్తా'మంటూ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకురావడంతో వివాదం సద్దు మణింగింది.

మరో కేసులో, పార్వతీపురంలో నిరుద్యోగుల పేరిట లోన్లు తీసుకుని కొందరు దళారీలు దందా చేసుకున్నారు. అది కూడా బ్యాంకు నోటీసులతోనే బయటపడింది. ఇంకో సంఘటనలో, అధికారుల చలవతో ఆర్టీసీ సొ్మ్ము కాజేసి పోలీసులకు పట్టుబడి విచారణ ఎదుర్కొంటున్నాడో ప్రబుద్ధుడు. ఇవన్నీ ఇలా ఉంచితే, తాజాగా రామభద్రపురం స్టేట్ బ్యాంకు మేనేజరు వారణాసి బాలకృష్ణ బినామీ పేర్లతో 1.83 కోట్లు స్వాహా చేసేసాడు. దీంతో అతనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

  • Loading...

More Telugu News