: జైల్లో పుట్టాడు.. అమ్మను జైలు నుంచి విడిపించాడు
వింటే ఎవరి హృదయం అయినా కరగక మానదు. బెయిల్ మంజూరైన 19 ఏళ్ల తర్వాత ఓ మహిళ జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన విజయకుమారికి హత్య కేసులో జీవిత ఖైదు పడింది. దాంతో 1990లో జైలుకెళ్లింది. 1994లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు 5,000 రూపాయలు చెల్లించాలి. కానీ విజయకుమారి వద్ద చిల్లిగవ్వలేదు. ఎవరూ రూపాయి సాయం చేయలేదు. లక్నో జైలులో ఉన్న విజయకుమారికి అదే సమయంలో కొడుకు జన్మించాడు. ఆరేళ్ల తర్వాత అతడిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడే పెరిగి అమ్మను విడిపించడం కోసం గార్మెంట్ ఫ్యాక్టరీలో వర్కర్ గా పనికి కుదిరాడు. రూపాయి రూపాయి దాచిపెట్టి మొత్తానికి అమ్మను విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మానవత్వం మాసిపోలేదని, అనుబంధాలు వాడిపోలేదని ఇలాంటివి అప్పుడప్పుడూ రుజువు చేస్తుంటాయి.