: నీటిలోనూ పనిచేసే సోనీ ట్యాబ్లెట్
నీటిలోనూ చెక్కు చెదరకుండా పనిచేసే ట్యాబెట్ల్ ను సోనీ కంపెనీ 'ఎక్సీపీరియా జెడ్' పేరుతో భారత్ లో విడుదల చేసింది. దీని ధర 46,990. ప్రపంచంలో అతి పలుచని(6.9 మిల్లీ మీటర్లు) ట్యాబ్లెట్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ట్యాబ్లెట్ నుంచి టీవీకి, స్పీకర్ కు, ఫోన్ నుంచి ట్యాబ్లెట్ కు సమాచారాన్ని పంపుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇందులో 10.1 అంగుళాల డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్స్ వెనుక కెమెరా, 2 మెగాపిక్సెల్స్ ముందు కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.