: ఫోన్ కాల్ తో ఆగిన పెళ్లి
కరీంనగర్ జిల్లా గోదావరి ఖని జ్యోతి నగర్, అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతికి నగునూరు గ్రామానికి చెందిన యువకుడితో ఈ రోజు వివాహం జరిపించడానికి ఏర్పాట్లనీ సర్వం సిద్ధమయ్యాయి. ఆ యువతిని ప్రేమించిన యువకుడు ఫోన్ కాల్ తో పెళ్లిని ఆపేశాడు. ఏకంగా వరుడికి కాల్ చేసి ''నా ప్రియురాలిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు?'' అని అడిగాడు. దీంతో అబ్బాయి తరపు వారు పెళ్లి వేడుక వరకు రాకుండానే విరమించుకున్నారు. ఇది తెలిసి వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పచ్చని పెళ్లివేడుకలో చిచ్చు పెట్టిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.