: ఢిల్లీలో మొదలైన రాహుల్ భేటీ.. కిరణ్, బొత్స హాజరు


రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ సహా అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.

ప్రధానంగా 2014 ఎన్నికలలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలన్నది రాహుల్ యోచన. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలు, పొత్తులు ఇతర అంశాలపై ఈ రోజు భేటీలో చర్చించనున్నారు. అలాగే పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఆరు పెద్ద 
రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

  • Loading...

More Telugu News