: యాక్షన్ సన్నివేశాలకు షారూక్ ఆరునెలలు దూరం
కుడిభుజానికి సర్జరీ చేయించుకున్న షారూక్ ను ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు బుధవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. సర్జరీ విజయవంతం అయిందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా షారూక్ కుటుంబ సభ్యులు తెలిపారు. డిశ్చార్జ్ చేసిన సంద్భంగా షారూక్ మీడియాతో మాట్లాడారు. తానొక జవానునని, జవాను ప్రతీసారీ అన్నింటినీ అధిగమించి ముందుకు వెళతాడని అన్నారు. ''నేను క్షేమంగా ఉన్నా. ఆరు నెలల వరకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీనిని పాటిస్తాను'' అని షారూక్ చెప్పారు. అయితే, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం షారూక్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర ప్రచారంలో పాల్లొంటారని సమాచారం.